Health

కలబంద ఉపయోగాలు – ఆరోగ్యమైన జీవనశైలి సొంతం చేసుకోండి

aloe vera uses
Written by TeluguFeedOnline

అలోవెరా… దీనిని తెలుగు లో కలబంద అంటారు. కలబంద తెలియని వారు ఎవ్వరు ఉండరు. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.కలబంద ను ఎన్నో మందులా తయారీ లో ఉపయోగిస్తారు. కాస్మెటిక్ తయారీ లో దీనిని అధికంగా ఉపయోగిస్తారు. చర్మం నిగారింపు ఇచ్చే ఉతప్పతులు మరియు శిరోజా సంరక్షణ ఉతపతులు వీటిని వాడుతారు.

ఇది పెంచుకునే మొక్కగా మాత్రమే చాల మందికి తెలుసు . తక్కువ నీటిని తీసుకొని సులభంగా పెరిగే మొక్క. ఇందులో సుగుణాలు మాత్రం చాల మందికి తెలియదు. ఇందులో ఏ,సి,ఈ,బి,బి 1 ,బి 2, బీ౩ , బి 6 ,బి 12 విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి.

జుట్టు పెరుగుదల 

కలబంద జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది.చుండ్రు ను తగ్గించడంలో సహాయపడుతుంది.అలోవెరా గుజ్జులో పెరుగు కలిపి తలకు పట్టించి తలస్నానం చేయడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. కనుబొమ్మలు పలుచగా ఉండేవారు రోజు ఆలోవెరా గుజ్జును అప్లై చేయడం వల్ల ఉతైనా నల్లటి కనుబొమ్మలను సొంతం చేసుకోవచ్చు.


జీర్ణక్రియ మెరుగుపరుచుతోంది

అలోవెరా జీర్ణక్రియ మెరుగుపరుచుతోంది. మనం తిన్న ఆహారం లో ఉన్న న్యూట్రీషన్లు శరీరంలో గ్రహించేలా దోహదపడుతుంది.  ఈ రసాన్ని తీసుకోవడం వల్ల శరీరంలోని జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది.  మలబద్దకాన్ని దూరం చేయడంలో అలోవెరా జ్యూస్ చాలా కీలక పాత్ర పోషిస్తోంది.

అధికఉన్న బరువును తగ్గిస్తోంది

అధిక బరువుతో బాధ పడేవారికి అలోవేరా ఒక గొప్ప వరంగా చెప్పవచ్చు. బరువు తగ్గాలనుకునే వారు ప్రతి రోజు జ్యూస్ సేవించడం వల్ల మంచి ఫలితాన్ని పొందవచ్చు .శరీరంలో పెరిగే చెడు కొవ్వును తొలగించడంలో సహాయపడుతుంది. అంతేకాదు శరీరంలోని కొలెస్ట్రాల్ ఇది తగ్గిస్తుంది.


కీళ్ల నొప్పులను తగ్గిస్తోంది

అలోవెరా జ్యూస్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ బాక్టీరియా లక్షణాలు కలిగి ఉంది. అందువల్ల కీళ్ల నొప్పులు మరియు వాపులకు తగ్గించుకో తగ్గించుకునేందుకు ఇది సహాయపడుతుంది. అంతేకాదు ఇది శరీరంలో కణాలను పునరోత్తపతి చేస్తుంది. శరీరంలో మలినాలను తగ్గిస్తుంది.

దంత సమస్యల నుండి రక్షణ

ఆలోవీర దంతక్షయాన్ని అరికడుతుంది. దంత సమస్యలను దూరం చేయడంతో పాటు చిగుళ్ళను ఇన్ఫెక్షన్ సమస్య నుండి దూరంగా చేస్తుంది. అందువల్ల ఇది మంచి మౌత్వాష్ గ కూడా ఉపయోగపడుతుంది.


సౌందర్య సాధనం

అలాగే కలబంద మంచి ఫేసియల్ గా కూడా ఉపయోగపడుతుంది. కలబంద గుజ్జులో కొంచెం పసుపు, ఒక చెంచా తేనె, పాలమీగడ, రోజ్ వాటర్ తో కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి మాస్క్ లాగా వేసుకోవాలి. కొచం సేపు ఉండనిచ్చి గోరువెచ్చని నీళ్లలో కడిగేయాలి. ఇలా చేయడంవల్ల పిగ్మెంటేషన్ మచ్చలు, కాలిన గాయాలు, మొటిమల వల్ల వచ్చిన మచ్చలు తొలగిపోయి చర్మం కాంతివంతంగా మారుతుంది.

ముఖం ఫై టాన్ 

ఎండ తీవ్రతవల్ల ముఖంపై తాన్ పెరుగుతోంది  అలాంటప్పుడు ఆలోవెరా గుజ్జును నిమ్మరసం కలిపి మేడ, చేతులు, ముఖం ఫై రాసుకోవాలి. దీనిని రాసుకుని పదిహేను నిమిషాలు తర్వాత గోరువెచ్చని నీటితో కడిగితే కలిగితే నలుపుదనం తగ్గుతుంది.

ప్రసవం తరవాత పొట్ట ఫై ఉన్న మచ్చలు తాగించటానికి ఉపాయూపడుతోంది.

చెక్కర వ్యాధి 

చెక్కర వ్యాధి ఉన్నవారికి రక్తంలో చక్కెర శాతం పెంచడానికి ఉపయోగపడుతుంది. గుండెపోటు, రక్తపోటు, కీళ్ల నొప్పులు, కిడ్నీ, కాలేయ సమస్యలు నివారించుకోవడానికి కూడా ఉపయోగిస్తారు.

ఇన్ని ఉపయోగాలున్న కలబందను ఉపయోగించండి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోండి.

About the author

TeluguFeedOnline

Leave a Comment